సోమందేపల్లి మండల పరిధిలోని మాగేచెరువులో భగీరథ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. మావటూరు భగీరథ ఉప్పర కులస్తులు భగీరథ చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమందేపల్లి మాజీ జడ్పిటిసి ఆర్ వెంకటరమణ, గ్రామ పెద్దలు సగర మాజీ సగర డైరెక్టర్ నర్సింహులు, గ్రామ నాయకులు తదితరులు హాజరయ్యారు.