జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దరాంపురం గ్రామంలో ప్రజలకు డెంగీ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. గ్రామాలలో ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ ఆరోగ్య పర్యవేశకుడు రామ్మోహన్ తెలిపారు. దోమతెరలు వాడండి, దోమకాటు నుండి కాపాడుకోండి. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.