శ్రీసత్యసాయి జిల్లా, రొద్దం మండలం సచివాలయ సిబ్బంది తరపున విజయవాడ వరద ప్రభావిత బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27వేలను గురువారం జిల్లా కలెక్టర్ చేతన్ కి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ విజయ్ కుమార్ ఉన్నారు.