వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా మొట్ట మెదటిసారి పెనుకొండకు విచ్చేసిన మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్ చార్జ్ ఉషా శ్రీచరణ్ కి పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికారు. ఆదివారం సోమందేపల్లి మండల కేంద్రంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఉషాశ్రీచరణ్ కు గజమాలతో సత్కరించారు.