గాండ్లపెంటలో శుక్రవారం గంగాభవాని అమ్మవారి 17వ వార్షిక మహోత్సవ తిరుణాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి జాతరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం కలశ స్థాపన, అష్టోత్తర పూజ, గణపతి పూజ, కుంకుమార్చన, తీర్థ ప్రసాదాలు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు నెల్లూరు వారిచే చెక్కభజన కార్యక్రమం నిర్వహించుచున్నట్లు నిర్వాహకులు తెలిపారు.