అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శిరగంవాండ్లపల్లి కి చెందిన బేల్దారి రామాంజి కుమారుడు అశ్వర్థప్ప (25) గోరంట్ల నుండి బేల్దారి పని ముగించుకుని వస్తుండగా.. ఇదే మండలానికి చెందిన చొండూరు వాండ్ల పల్లి కి చెందిన పార్వతి రెడ్డి కుమారుడు వేణుగోపాల్ చొండూరు వాండ్ల పల్లి నుండి గోరంట్లకు పాలు తీసుకుని వస్తున్న సమయంలో శంకర నారాయణ టీచర్ బోర్ బావి దగ్గర వరిగడ్డి వేసుకొని పోతున్న ట్రాక్టర్లను దాటుతున్న సమయంలో ఇద్దరి వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
అశ్వర్థప్పకు ఎక్కువ గాయాలు కావడం వల్ల స్థానిక గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకుని వెళ్తుండగా.. మార్గ మధ్యంలో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. వేణుగోపాల్ ను కూడా తలకు, చేతికి గాయాలు తగలడం వల్ల కదిరి ఆసుపత్రికి తరలించారు.