గోరంట్ల మండలం గడ్డం తాండకల్లి గ్రామానికి చెందిన వీర జవాన్ మురళినాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. మురళి నాయక్ గ్రామానికి జవాన్ తల్లి పాదాలకు సినీ నటుడు శివారెడ్డి గురువారం పాదాభివందనం చేశారు. అనంతరం మురళినాయక్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ గొప్ప యోధుడిని కన్న తల్లివి నీవని అని కొనియాడారు.