గోరంట్ల: మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

50చూసినవారు
గోరంట్ల: మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
గోరంట్ల మండలం కల్లి తాండ గ్రామంలో అగ్ని వీర్ మురళి నాయక్ తల్లిదండ్రులను ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్బంగా మురళీ నాయక్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మురళీ నాయక్ సమాధి వద్ద నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సమాజ సేవకులు వెంకట శివారెడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్