గోరంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గంధం ధీరజ్ అనే విద్యార్థి విజయవాడ ప్రాంత ప్రజలు వరదల్లో పడుతున్న కష్టాల గురించి తెలుసుకొని వారికోసం తనవంతుగా తన కిడ్డీ బ్యాంకులో దాచుకుంటున్న నగదును రూ.1000 సీఎం రిలీఫ్ ఫండ్ కు బుధవారం సీఐ శేఖర్ చేతుల మీదుగా అందజేశాడు. ఈచ్ వన్ - హెల్ప్ వన్ నినాదంతో ముందుకు వెళితే ఎంతో మంది నిరాశ్రయులకు సహాయం చేయవచ్చని ధీరజ్ తెలిపారు.