పెనుకొండ పట్టణంలో మంగళవారం పెనుకొండ నియోజకవర్గంలోని మహిళా సంఘాలు ఆధ్వర్యంలో మహిళలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మహిళలు ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్, దర్గా సర్కిల్, తెలుగు తల్లి సర్కిల్ మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఏవో కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సాక్షి దినపత్రిక లను దహనం చేశారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు.