శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం ఉదయం 6 గంటలకు కురిసిన భారీ వర్షం కారణంగా దిగువ గంగంపల్లి తండాలో పిడుగు పడింది. ఈ ఘటనలో దశరథ నాయక్ (45), జయబాయి (42) అనే భార్యభర్త అక్కడికక్కడే మరణించారు. వారి కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉంది. ఆవుల షెడ్‌లో పాలు పిండడానికి వెళ్లిన సమయంలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు పాడి ఆవులు మరణించాయి. ఈ ఘటనతో కుటుంబం విషాదంలో మునిగింది.