చేనేతల ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్ లో వివిధ జిల్లాల చేనేత అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అధికారులు పాల్గొన్నారు.