ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లేపాక్షి నంది విగ్రహ చిత్రంతో స్టాంప్, వీరభద్ర స్వామి ముఖచిత్రంతో పోస్ట్ కార్డును విడుదల చేస్తున్నట్లు హిందూపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం 11 గంటలకు లేపాక్షిలోని ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర చీప్ పోస్టు మాస్టర్ జనరల్ ప్రకాష్, కర్నూలు రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ ఉపేందర్ లు హాజరుకానున్నారు.