మడకశిర నియోజకవర్గం అగళి మండలం రామనపల్లి, కసాపురం, అగళి ఎస్సీ కాలనీ, రామాపురం బీసీ కాలనీ లలో “పల్లె పండుగ” కార్యక్రమంలో బుధవారం మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి తో కలిసి సీసీ రోడ్లకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.