మాగే చెరువు: ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

76చూసినవారు
మాగే చెరువు: ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ
సోమందేపల్లి మండలం మాగే చెరువు గ్రామంలో శనివారం జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూటమి నాయకులు భూమి పూజ చేశారు. మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు 40 వేల లీటర్లు సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. ట్యాంకు నిర్మాణానికి నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్