బాలికల హై స్కూల్, జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత

84చూసినవారు
బాలికల హై స్కూల్, జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బాలికల హై స్కూల్, బాలికల కళాశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్ టైల్స్ మంత్రి సవితమ్మ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లు అద్వానంగా ఉండడం పై మంత్రి సవితమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్