విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నివాళులర్పించారు. అదేవిధంగా ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటి చెప్పిన మానవతా మూర్తి మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా మదర్ థెరిస్సా చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు.