పారిశుద్ధ్య కార్మికుల సేవలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రశంశించారు. ఆదివారం విజయవాడలోని 54వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్తా చెదారం తొలగింపు పనులను మంత్రి పర్యవేక్షించారు. హ్యాట్సాఫ్ అంటూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను మంత్రి కొనియాడారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు.