శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం తురుకులాపట్నం గ్రామము బస్టాండ్ నుండి పెద్ది పల్లి గ్రామం వరకు రూ. 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ఎన్డిఏ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.