నంబులపూలకుంట మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవత, నల్ల గంగమ్మ దేవతలకు మంగళవారం ప్రత్యేక అలంకరణ చేసి ప్రజలకు దర్శన అవకాశం కల్పించారు. యల్లమ్మ ఆలయం సమీపంలో నెల్లూరు వారిచే కోలాటం, ఆర్కెస్ట్రా, తదితర సాంస్కృతి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న గంగమ్మ దేవతల ఆలయాల ముందు పొట్టేలు, కోళ్లు, మేకపోతులు బలిదానం చేశారు.