ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు చొరవ చూపాలి: మంత్రి

55చూసినవారు
ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు చొరవ చూపాలి: మంత్రి
ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు చొరవ చూపాలని పెనుకొండ మండల అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పెనుకొండ అభివృద్ధి పై మండల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ స్వరాజ్యంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని ఆయన కలలు సాకారం కావాలంటే కలసికట్టుగా పనిచేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్