సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిగి మండలం ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.