పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయితీలోని పెద్దిరెడ్డి పల్లిలో శుక్రవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.