పెనుకొండ నియోజకవర్గం పరిగి ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీధర్ ఆకస్మికంగా మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నఆయన బెంగళూరులోని హ్యస్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. విషయం తెలిసిన వెంటనే ఉభయ జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజ, సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఎంపీడీఓ శ్రీధర్ మృతికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.