పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీలోని విద్యానగర్ లో దొంగలు చోరీ పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. విద్యానగర్ లోని ఇంటి నంబరు 3-375/3 లో నివాసం ఉంటున్న శంకరప్ప ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 35 తులాల బంగారం 40 వేలకు పైగా నగుదును దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని శంకరప్ప తెలిపారు.