శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలోని జయ మంగళ నదికి వరద నీరు బుధవారం పోటెత్తుతున్నది. తుఫాను ప్రభావంతో ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతాలతో పాటు మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నదీ ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. పరిగి చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీరంగరాజు పల్లి వద్ద ప్రమాదకరంగా మారిన జయమంగళీ నది కాజ్వే పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రాకపోకలు జరగకుండా ఇరువైపుల అడ్డువేశారు.