రాజ్యాంగ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తోందని బీజేపీ నాయకులు వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. శనివారం పరిగి మండల కేంద్రంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.