రొద్దం పెన్నానదిలోకి పరుగులు తీస్తున్న పరిగిచెరువు మరువనీళ్లు

72చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరు పెన్నానదిలోకి పరిగి చెరువు మరువ నీళ్లు శుక్రవారం వెళ్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, ప్రజలు నీటిని చూడడానికి వందలాది గా తరలి వచ్చారు. ప్రజలు, యువకులు చేపలు పట్టుకోవడానికి పోటీ పడ్డారు. వాహనదారులు పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ ను చూడడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్