పెనుకొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. 1991-92 సంవత్సరంలోని 10 వ తరగతి విద్యార్థులు తాము చదువకున్న పాఠశాలలో కలిశారు. తమ గురువులను సన్మానించారు, ఆనాటి తమ అల్లరి, గురువులు చెప్పిన పాఠాలు, చిలిపి చేష్టలను నెమర వేసుకుని మురిసిపోయారు. త్వరలో ఓ ట్రస్టు ప్రారంభించి, పేద విద్యార్థులకు, ఉపాధ్యాయుల వైద్య ఖర్చులకు చేయుతనివ్వనున్నట్లు ప్రకటించారు.