పరిగి మండలం ధనాపురం హైవే వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అలాగే చనిపోయిన మృతదేహాలకు నివాళులర్పించారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులు అధికారులను ఆదేశించారు.