శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు వడ్డీ చౌడప్ప మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ పార్థసారథి వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.