పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీడాప్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు పలువురికి ఉపాధి కల్పించేలా 25 రకాల చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (సీడాప్ )సెంచూరియన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై యువతకు అవగాహన సదస్సును నిర్వహించారు.