పెనుకొండ నగర పంచాయతీలోని 20వ వార్డు మంగాపురంలో శుక్రవారం కాఫీ విత్ వైసీపీ లీడర్స్ క్యాడర్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, ప్రజలతో కలసి కాఫీ త్రాగుతూ ప్రజలందరినీ పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తీగా విఫలమైందన్నారు.