పెనుకొండ పట్టణంలోని నిన్నటి రోజున శివ మాలలో వున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసులును కొట్టడం పట్ల దాదు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఆదివారం ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను హిoదూ సోదరులకు వ్యతిరేకం కాదని శివమాల ధరించిన వ్యక్తి యొక్క ఆటోకు నా కార్ డోర్ తగిలిందని ఆ విషయంలో నాకు స్వామికి గొడవ జరిగిందని ఆ సమయంలో దురదృష్టవశాత్తు అది మేము ఇద్దరం కొట్టుకునేదాకా వెళ్ళిందన్నారు.