పెనుకొండ పట్టణలోని రైతు సేవా కేంద్రం లో ఖరీఫ్-2025 సీజన్ కు సంబంధించి రైతులకు ప్రభుత్వ సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిచందన, టీడీపీ టౌన్ కన్వీనర్ శ్రీరాములు, మండల కన్వీనర్ ప్రసాద్, పట్టణ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మ, రామలింగ, రఘువీర చౌదరి, బాబుల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.