వైసీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పార్టీ జిల్లా కమిటీలో చోటు పొందిన మండల కన్వీనర్లుగా నియమితులైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనునిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.