దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు.