తెలుగు సాహిత్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) చెరగని ముద్ర వేశారని మంత్రి ఎస్. సవిత కొనియాడారు. గురువారం మొల్ల జయంతి సందర్బంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఆమె రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు