నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం పెనుగొండ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని, పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.