గడిచిన అయిదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో హింసాత్మక ఘటనల్లో జగనే మొదటి ముద్దాయి అని మంత్రి ఎస్. సవిత అన్నారు. శుక్రవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ నాగరాజుతో కలిసి మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘటనా స్థలానికి వెళ్లారన్నారు.