పెనుకొండ: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఏపీడబ్ల్యూజెఎఫ్

79చూసినవారు
పెనుకొండ: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఏపీడబ్ల్యూజెఎఫ్
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలోని ఆర్డివో కార్యాలయంలో ఏవో గిరికి జర్నలిస్ట్ లు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు జాకిర్ హుస్సేన్, నవీన్ కుమార్, మల్లికార్జున, హరి, మురళీ, మూర్తి, రఘు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్