పెనుగొండ: అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎంపీ బికె

55చూసినవారు
పెనుగొండ: అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎంపీ బికె
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అని హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం పెనుగొండ పట్టణంలోని ఎంపీ కార్యాలయం వద్ద అంబేద్కర్ జయంతి సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి ఎంపీ బి. కె. పార్థసారథి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో బహుజన నాయకులు, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్