పెనుకొండ: దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ

1263చూసినవారు
పెనుకొండ: దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కరణ్, గజేంద్ర, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్