పెనుకొండ: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

52చూసినవారు
పెనుకొండ: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పెనుకొండ పరిధిలోని మరువపల్లి గ్రామ సమీపాన రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపిన వివరాల మేరకు చాకలి రాజు (32) రాత్రి కేకే ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి మరణించినట్లుగా తెలిపారు. మృతుడు తరచూ ఇంట్లో గొడవపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్