శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సవిత కలెక్టర్ తోనూ బీసీ సంక్షేమ శాఖాధికారులతోనూ ఫోన్లో మాట్లాడారు. సీకే పల్లి బాలుర హాస్టల్ లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని ఆరా తీశారు.