పెనుగొండ మండలం కొండoపల్లి గ్రామంలో రూ. 30లక్షలతో తాగునీటి ట్యాంకును నిర్మాణానికి శుక్రవారం భూమి పూజలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాంపురంలో ఓహెచ్ఆర్ తాగునీటి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ కొండoపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.