పెనుకొండ నియోజకవర్గం మంత్రి సవిత శనివారం పర్యటించునున్నారు. పెనుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు ఉదయం 11: 00 గంటలకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎస్ఎస్సీ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని ఇంటర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను మంత్రి సవిత ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొననున్నారు.