వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని మంత్రి సవిత శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.