కర్నూలు జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసిన ఎంపీ బత్తిపాటి నాగరాజుకు మంత్రి ఎస్. సవిత ధన్యవాదాలు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన బీసీ శంఖారావం వన భోజన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని సవిత సందర్శించారు. ఎంపీని నిధులు కేటాయించాలని మంత్రి అడుగగా వెంటనే ఎంపీ నిధుల ఇస్తామన్నారు.