పెనుకొండ పట్టణంలో వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం ముస్లిం, మైనారిటీలు నిరసన ర్యాలిని నిర్వహించారు. వాయిస్ ఆఫ్ విక్ టీమ్స్, పెనుకొండ ముస్లిం, మైనార్టీ మత పెద్దలు, మత గురువుల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఈద్గా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆర్డివోకు వినతి పత్రం సమర్పించారు.